Interstate gang arrested : గుంటూరులో కరడుగట్టిన ఇద్దరు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, బంగారం,వెండిని స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే... తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న హైదరాబాద్ కు చెందిన ఆవుల కిరణ్ కుమార్, కోసూరి శ్రీనివాసరావులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 40 లక్షల రూపాయలు విలువ చేసే 875 గ్రాముల బంగారం, లక్షా 40వేల విలువైన 2 కిలోల వెండి, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.వీరిద్దరూ..వివిధ జిల్లాల్లో మొత్తం 13 కేసుల్లో నిందితులుగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిగతంగా ఆవుల కిరణ్ పై ఇప్పటివరకు 125 కేసులు, శ్రీనివాసరావుపై 30 క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.
Interstate gang arrested : గుంటూరులో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్... - గుంటూరులో దొంగల ముఠా అరెస్ట్
Interstate gang arrested : గుంటూరులో కరడుగట్టిన ఇద్దరు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, బంగారం,వెండిని స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరులో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్...