ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తాడికొండలో ఆగని వైకాపా వర్గపోరు.. పోలీసుల అదుపులో సొంత పార్టీ ఎంపీపీ - YSRCP MPP

YSRCP MPP: తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సారథ్యంలో జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిరసనకు దిగుతారనే సమాచారంతో.. వైకాపా ఎంపీపీ మన్నవ స్వప్న, ఆమె భర్త మాజీ ఎంపీటీసీ రాజేష్​ను పోలీసులు నిర్బంధించారు. స్వప్నను పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. రాజేష్​ నిరాకరించడంతో ఈడ్చుకెళ్లారు.

YSRCP MPP
వైకాపా ఎంపీపీని అధుపులోకి తీసుకున్నపోలీసులు

By

Published : Sep 27, 2022, 4:58 PM IST

Guntur YSRCP: గుంటూరు జిల్లా మేడికొండూరు వైకాపా ఎంపీపీ మన్నవ స్వప్న, ఆమె భర్త రాజేష్‌ను పోలీసులు నిర్బంధించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సారథ్యంలో జరిగిన చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిరసనకు దిగుతారనే సమాచారంతో.. వారిద్దరినీ పోలీసులు నిర్బంధించారు. ఎంపీపీ స్వప్నను పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఆమె భర్తను ఫిరంగిపురం స్టేషన్‌కు తరలించారు. పోలీసులతో వెళ్లేందుకు రాజేష్‌ నిరాకరించారు. దాంతో ఆయన్ను ఈడ్చుకెళ్లి వాహనంలో పడేసి అక్కడినుంచి తరలించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యాక వారిద్దరినీ వదిలిపెట్టారు. ఇటీవల తాడికొండ వైకాపా ఇన్‌ఛార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించారు. అప్పటినుంచి పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. స్వప్న, ఆమె భర్త రాజేష్‌ కొన్ని రోజులుగా మాణిక్యవరప్రసాద్‌ వెంట నడుస్తున్నారు.

వైకాపా ఎంపీపీ మన్నవ స్వప్న, ఆమె భర్త రాజేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details