పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రతిరోజు నమోదు అయ్యే పాజిటివ్ కేసుల ప్రైమరీ, సెకండరి కాంటాక్ట్స్‌కు మరుసటి రోజే పరీక్షలు చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ సిబ్బందిని ఆదేశించారు. పరీక్షలకు తీసుకున్న శాంపిల్స్, ఏరోజుకి ఆరోజు ల్యాబ్‌కి పంపాలని సూచించారు.
పరీక్షలు చేసే సమయంలోనే వారి రిజల్ట్ వచ్చే వరకు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలే చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరీక్ష చేయించుకున్న వారి ఫోన్ నంబర్, చిరునామా, సచివాలయం నంబర్ విధిగా సేకరించాలని... లేకుంటే కాంటాక్ట్ ట్రేసింగ్ ఇబ్బంది అవుతుందని వివరించారు.