prc sadhana samithi : పీఆర్సీ సాధన సమితి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బొప్పరాజు, డోలాస్‌నగర్‌లోని వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద భద్రత పెంచారు. ఉపాధ్యాయ సంఘాలు ముట్టడిస్తాయన్న ముందస్తు చర్యల్లో భాగంగా భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడ ధర్నాచౌక్ ఎన్జీవో హోమ్ వద్ద సైతం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్జీవో హోమ్‌కు వెళ్లే మార్గాలకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎన్జీవో హోమ్‌ను ఉపాధ్యాయులు ముట్టడిస్తారని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధం
స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాల నేతలం రాజీనామా చేస్తున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనలకు 3 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ చర్చల్లో స్టీరింగ్ కమిటీ ఏకపక్షంగా వెళ్లింది. రాష్ట్రంలోని జేఏసీ ఛైర్మన్లకు రాజీనామాలు పంపుతున్నాం. పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు సిద్ధం. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు చేపడతాం. రౌండ్ టేబుల్ భేటీలో కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమిస్తాం.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఉద్యమిస్తాం.సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం.- ఉపాధ్యాయ సంఘాలు
ఇదీ చదవండి :teachers union on prc : పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో 5 రోజులు నిరసనలు