ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రుణాలని చెప్పారు.. ఆధార్​, రేషన్​ కార్డులిచ్చి మోసపోయాం' - fake loans in guntur

రుణాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని కొందరు మహిళలు గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆధార్, రేషన్ కార్డులు తీసుకుని తమ పేరిట గృహ రుణాలు తీసుకున్నారంటూ మహిళలు పోలీసులకు తెలిపారు.

cheating under home loans in guntur
రుణాల పేరుతో మోసం

By

Published : Apr 19, 2021, 6:04 PM IST

అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితులు

రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఆధార్, రేషన్ కార్డులు తీసుకుని తమ పేరిట గృహ రుణాలు తీసుకున్నారంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని కొందరు మహిళలు ఆశ్రయించారు. జగనన్న గృహ నిర్మాణం పథకానికి తాము దరఖాస్తు చేశామని.. ఈ విషయమై అధికారులను వివరాలు కోరారు. అయితే తమ పేరున అప్పటికే ఇంటి రుణం మంజూరైన విషయాన్ని అధికారులు చెప్పినట్లు బాధితులు వాపోయారు. తమలాగే సుమారు 30 మంది మహిళల నుంచి ఆధార్, ఇతర గుర్తింపు కార్డుల జిరాక్స్​లు తీసుకుని.. ఇద్దరు మహిళలు బినామీ రుణాలు పొందినట్లు బాధితులు ఆరోపించారు.

ఈ ఘటనపై గతంలో పోలీసులను ఆశ్రయించినప్పటికీ తమపైనే కేసులు పెట్టారని బాధిత మహిళలు వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి సమగ్ర విచారణ జరపించి.. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details