గతేడాది కాలంలో హోంశాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చినట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు. ప్రధానంగా పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు, పెండింగ్ ఖాళీల భర్తీ వంటి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జైళ్లలో ఉండే ఖైదీలకు చేతి వృత్తుల నైపుణ్యాలు వృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు.
'ఏడాది కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం'
తాము అధికారంలోకి వచ్చాక హోంశాఖలో పలు సంస్కరణలు తెచ్చినట్లు హోమంత్రి సుచరిత అన్నారు. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు, ఖైదీలకు చేతి వృత్తి నైపుణ్యాలను అందించడం వంటివి పనులు చేశామని తెలిపారు.
హోంమంత్రి సుచరిత
కడప జైలులో ఈ దిశగా చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను 19 కోట్ల రూపాయల మేర విక్రయించినట్లు చెప్పారు. ఇలా మరెన్నో మంచి కార్యక్రమాలు తమ శాఖ తరపున చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి... నిషేధం అనంతరం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు