ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెలగపూడి రాళ్లదాడి ఘటనపై సమగ్ర విచారణ: హోంమంత్రి - గుంటూరు తాజా వార్తలు

వెలగపూడి రాళ్లదాడి ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Home Minister Sucharitha
హోంమంత్రి మేకతోటి సుచరిత

By

Published : Dec 28, 2020, 12:35 PM IST

Updated : Dec 28, 2020, 1:25 PM IST

వెలగపూడిలో రాళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మరియమ్మ అలియాస్ బుజ్జిని అన్ని విధాల ఆదుకుంటామని హోంమంత్రి సుచరిత హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబీకులకు 10లక్షల పరిహారాన్ని మంత్రి ప్రకటించారు. రాళ్ల దాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ఘటనలో బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందులో పోలీసుల పాత్ర ఉంటే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. ఈ ఘటనలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పైనా విచారణ చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు మంత్రిని డిమాండ్ చేశారు. తప్పకుండా జరిపిస్తామని హామీ ఇచ్చారు. అంతకముందు మరియమ్మ మృతదేహానికి మంత్రి సుచరిత నివాళులర్పించారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత

మంత్రి సుచరితతో పాటు వచ్చిన ఎంపీ నందిగామ సురేష్ వెనక్కి వెళ్లిపోవాలంటూ మృతురాలి బంధువులు నినాదాలు చేశారు. ఈ సమయంలో మృతురాలి బంధువులు గట్టిగా ప్రతిఘటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మంత్రి, ఎంపీ, శాసనసభ్యులను మృతురాలి ఇంటికి తీసుకెళ్లారు. అన్ని విధాల ఆదుకుంటామని బుజ్జి కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు.

Last Updated : Dec 28, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details