దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న తెదేపా (tdp) నాయకులు.. ఈ చట్టం ఏర్పాటుతో వచ్చిన నష్టమేంటో చెప్పాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత (home minister sucharitha) నిలదీశారు. దిశ చట్టాన్ని (disha act) రెండు సభల్లోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ లోగానే ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, కోర్టులు, న్యాయమూర్తుల నియామక ప్రక్రియ 'దిశ'గా చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన రమ్య హత్య కేసులో ఏడు రోజుల్లోనే పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన అంశాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. నిర్భయ చట్టం వచ్చాక మహిళలపై పూర్తిస్థాయిలో నేరాలు ఆగిపోలేదన్న హోంమంత్రి.. దిశ యాప్ వచ్చాక మహిళల్లో భద్రత పెరిగిందని అభిప్రాయపడ్డారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేసంలో మంత్రి అప్పలరాజుతో కలిసి హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు.
యువత అత్మహత్యలు కలిచివేస్తున్నాయి..
'యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు (YUVATHA SUICIDE ) చేసుకుంటున్నారు. బంగారంలాంటి భవిష్యత్‌ను క్షణికావేశంలో అర్ధాంతంగా ముగిస్తూ.. జన్మనిచ్చిన తలిద్రండులకు తీరని వేదన మిగులుస్తున్నారు' అని హోంమంత్రి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి సమస్య వచ్చినా.. వెంటనే తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులకు చెప్పుకోవడంతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ( World Suicide Prevention Day) పురస్కరించుకొని బుడంపాడు సెయింట్ మేరిస్ ఇంజినీరింగ్ కళాశాలలో స్పందనా ఈదా అంతర్జాతీయ సంస్థ (SPANDANA EDA INTERNATIONAL FOUNDATION ) ఆధ్వర్యంలో విద్యార్ధినులకు అవగాహన కార్యక్రమం(Awareness on World Suicide Prevention Day) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు.
సోషల్ మీడియా (SOCIAL MEDIA ) ద్వారా పరిచయం అవుతున్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినులకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్.. మహిళల రక్షణ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారని హోంమంత్రి తెలిపారు. అమ్మాయిలు, మహిళల కోసం ప్రత్యేకంగా దిశ యాప్‌ను రూపొందించామన్నారు. దిశ యాప్ ద్వారా రక్షణ పొందిన మహిళలు ఎంతోమంది ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది 'దిశ యాప్' (DISHA APP)ను వినియోగిస్తున్నారని.. రక్షణ కోసం ప్రతీ మహిళ దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని హోంమంత్రి సుచరిత సూచించారు.
ఇదీ చదవండి..