తెదేపా నేత నారా లోకేశ్‌పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం హేయమైన చర్య అని ఆమె అన్నారు. గుంటూరు స్వర్ణభారతి నగర్లో వాహన మిత్ర లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరయ్యారు. తెదేపా అధికారంలోకి వస్తే హత్యలు చేస్తామని చెప్పకనే చెబుతున్నట్లు లోకేశ్ తీరు ఉందన్నారు సుచరిత. తెదేపా నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
తెదేపా తన ఉనికిని కాపాడుకోవడానికి తమ ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన రాజకీయ హత్యల గురించి ప్రజలందరికీ తెలుసన్నారు.