గుంటూరులో ఇటీవల దారుణహత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు పరామర్శించారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలాన్ని హోంమంత్రి వారికి అందజేశారు.
రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచివేస్తోంది. ముందే వేధింపుల విషయాన్ని పోలీసులకు చెప్పి ఉంటే ఈ ఘటన జరిగేది కాదేమో?. ప్రభుత్వం వెంటనే స్పందించి రమ్య కుటుంబాన్ని ఆదుకుంది. మృతురాలు సోదరి మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు.ఇంకా దిశ యాప్ ను విద్యార్థినులు, మహిళలు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది.కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నాం.-సుచరిత, హోంమంత్రి