ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GMC MEETING: అధికారుల తీరుపై హోంమంత్రి సుచరిత అసంతృప్తి - home minister sucharitha in gmc meeting

గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల తీరుపై హోం మంత్రి మేకతోటి సుచరిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం(Guntur Municipal Corporation general body meeting)లో ఆమె పాల్గొన్నారు.

home minister sucharitha at guntur
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

By

Published : Oct 1, 2021, 8:54 PM IST

గుంటూరు నగర అభివృద్థి, ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కలిసి పని చేయాలని హోం మంత్రి మేకతోటి సుచరిత(home minister sucharitha at gmc) అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం(Guntur Municipal Corporation general body meeting)లో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్పొరేటర్లు.. తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సమస్యల గురించి మాట్లాడుదామంటే అధికారులు(gmc officers not respond) ఫోన్లు ఎత్తడం లేదని తెలిపారు. దీంతో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హోంశాఖ మంత్రి.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఫోన్ చేస్తే తీయకపోవడం సరికాదని అన్నారు. తీరు మార్చుకోవాలని ఆధికారులను హెచ్చరించారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కలిసి పని చేయాలని హితవు పలికారు.

ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన లేళ్ల అప్పిరెడ్డి.. ఎక్స్ అఫిషియో హోదాలో సమావేశాని(gmc general body meeting)కి హాజరయ్యారు. ఈ సందర్బంగా మేయర్ మనోహరనాయుడు, కార్పొరేటర్లు.. అప్పిరెడ్డిని సన్మానించారు.

ABOUT THE AUTHOR

...view details