సంక్షేమం-అభివృద్ధి... రెండింటికి సమ ప్రాధాన్యం ఇస్తూ... సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బడుగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప నాయకుడు జగన్ అని కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అండగా నిలిచామన్నారు.
సంక్షేమం-అభివృద్ధి... రెండింటికి సమ ప్రాధాన్యం: హోంమంత్రి - AP News
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. మేనిఫెస్టోలోని హామీలను 94 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని.. హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. జగన్ పాలనా భాధ్యతలు చేపట్టి రెండేళ్ల పూర్తైన సందర్భంగా గుంటూరులోని తన నివాసంలో హోంమంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత