లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనా నియంత్రణ సాధ్యమవుతుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్జోన్లలో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మొబైల్ సూపర్ మార్కెట్‌ను ఆమె ప్రారంభించారు. అమరావతి సూపర్ మార్కెట్స్ ఆధ్వర్యంలో కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి వీటి ద్వారా కిరాణా సరకులు విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు సమకూర్చింది. రెడ్జోన్లలో ప్రజలు బయటకు వచ్చే వీలు లేనందున ఈ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని సూచించారు. నగరంలోని అన్ని రెడ్జోన్లలో ఈ మొబైల్ మార్కెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.
మొబైల్ సూపర్ మార్కెట్ ప్రారంభించిన హోం మంత్రి
కరోనా నియంత్రణకు ప్రజలందరూ కనీస జాగ్రత్తలు పాటించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మొబైల్ సూపర్ మార్కెట్‌ను ఆమె ప్రారంభించారు.
home minister sucharitha