ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత - ఏపీ కోవిడ్ కేసులు

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా పని చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. నివారణ చర్యల కోసం ప్రభుత్వం రూ. 600 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కరోనా నివారణ బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపైనా ఉందన్నారు. అందరూ స్వీయనియంత్రణ పాటించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు 8 ప్రభుత్వ, 12 ప్రైవేట్ ఆసుపత్రులో 3715 పడకలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

హోంమంత్రి సుచరిత
హోంమంత్రి సుచరిత

By

Published : Jul 24, 2020, 8:30 PM IST

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల కోసం ప్రభుత్వం రూ. 600 కోట్లు కేటాయించిందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలు, చికిత్స ఏర్పాట్లపై అధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సుచరిత విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని... ప్రధాన ఆసుపత్రులతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న దృష్ట్యా ఆసుపత్రుల్లో ఆ మేరకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కొవిడ్ రోగుల కోసం 8 ప్రభుత్వ, 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని... వాటిలో 3 వేల 715 పడకలు ఉన్నాయన్నారు. అలాగే వ్యాధి తీవ్రత లేని వారి కోసం 4,500 బెడ్లతో కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని... వాటి అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో కొవిడ్ గురించి ఎలాంటి సహాయం కోసమైనా కాల్ సెంటర్ నంబర్ 0863-2241492 కు ఫోన్ చేయాలని సూచించారు. కొవిడ్ బారినపడిన జర్నలిస్టులకు మంచి చికిత్సతో పాటు బీమా కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :'నా ఇష్టం- నా పాలన అంటే... ఎదురుదెబ్బలే'

ABOUT THE AUTHOR

...view details