వ్యవసాయంలో సాంకేతికత ఎంత ముఖ్యమో సేంద్రీయ విధానం కూడా అంతే ముఖ్యమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సంక్రాంతి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గుంటూరు క్లబ్లో లైవ్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలు, సంప్రదాయ నృత్యాలను తిలకించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ... సేంద్రీయ వ్యవసాయం ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. దేశంలోనే అత్యధికంగా సేంద్రియ వ్యవసాయం హిమాచల్ ప్రదేశ్లో జరుగుతోందన్నారు. ఏపీలో కూడా ఆ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ తనను కలిసిన సందర్భంగా సూచించినట్లు తెలిపారు.
సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వండి: గవర్నర్ దత్తాత్రేయ - ఏపీ తాజా వార్తలు
ప్రకృతిని ప్రేమించాలని..నాశనం చేయవద్దని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయానికి రైతులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రైతులు కూడా సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ సూచించారు. ప్రకృతిని ప్రేమించాలని... నాశనం చేయవద్దని అందరికీ హితవు పలికారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయత గొప్పదనం గురించి దేశ, విదేశాల్లో చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. నైతిక విలువలు పెంచేలా చదువులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కొత్త విద్యా విధానం తెచ్చిందన్నారు. మహిళను తల్లిగా పూజించే మన దేశంలో అత్యాచారాలు జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది యువత ఉన్న యంగ్ ఇండియా 2030 కల్లా అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు
TAGGED:
himachal pradesh governor