ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: రేపల్లెలో రోడ్డు విస్తరణ.. ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే - stays eviction of houses for road widening in Repalle

రేపల్లెలో రోడ్డు విస్తరణకు ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే విధించింది. బాధితుల పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రేపల్లెలో రోడ్డు విస్తరణకు ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే
రేపల్లెలో రోడ్డు విస్తరణకు ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే

By

Published : Oct 1, 2021, 5:59 PM IST

Updated : Oct 1, 2021, 7:34 PM IST

గుంటూరు జిల్లా రేపల్లెలో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా... రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు, దుకాణాలు తొలగింపు చర్యలు చేపట్టారని బాధితులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం... ఇళ్లు, దుకాణాల తొలగింపుపై స్టే విధించింది. అయితే ఇప్పటికే మునిసిపల్ అధికారులు కొన్ని ఇళ్లను తొలగించారు. విస్తరణకు సంబంధించి అందరికీ నోటీసులు జారీ చేశామని మునిసిపల్ అధికారులు హైకోర్టుకు తెలిపారు. స్టే పై ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని... ఆదేశాలు వచ్చిన వెంటనే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఏం జరిగిందంటే..

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో రోడ్డు విస్తరణను అధికారులు ప్రారంభించారు. పెద్ద మసీదు సెంటర్ నుంచి ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వరకు ప్రధాన రహదారిని అరవై అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే విస్తరణకు సంబంధించి ఇళ్లు, దుకాణాల తొలగింపుపై బాధితులుహై కోర్టును ఆశ్రయించారు.

ఇదీచదవండి.

CYBER CRIME: కొత్త రకమైన మోసాలకు తెర... లింకులు పంపించి..

Last Updated : Oct 1, 2021, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details