ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT : 'ఆ నగర పంచాయతీలకు ఎన్నికల ప్రకటన ఇవ్వకుండా అడ్డుకోలేం' - నగరపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై విచారణ

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు నగరపంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిలువరించాలన్న అప్పీలుదారుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసిన ధర్మాసనం... అప్పీళ్లను కొట్టేసింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Oct 28, 2021, 3:05 AM IST

గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిలువరించాలన్న అప్పీలుదారుల అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ఎన్నికల విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టంచేసిన ధర్మాసనం... అప్పీళ్లను కొట్టేసింది. ఈ వ్యవహారంపై వ్యాజ్యాలు పెండింగ్ లో ఉన్నందున సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని సింగిల్ జడ్జికి విజ్ఞప్తి చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిన్ ఏవి శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు అదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details