హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని చందానగర్ పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. హేమంత్ హత్యకు 10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. పక్కా పథకం ప్రకారమే చంపేశారని దర్యాప్తులో తేలిందన్నారు.
చందానగర్ పరువు హత్యను ఛేదించిన పోలీసులు - murder case cracked by madhapur police
హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని చందానగర్ పరువు హత్యకేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే హేమంత్‌ను హత్యచేశారని డీసీపీ వెల్లడించారు. కిరాయి హంతకులతో హేమంత్‌ను అపహరించి హత్య చేశారని పేర్కొన్నారు. గొంతుకు తాడు బిగించి హత్య చేశారని డీసీపీ వివరించారు.
![చందానగర్ పరువు హత్యను ఛేదించిన పోలీసులు hemant-defamation-murder-case-cracked-by-madhapur-police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8940562-435-8940562-1601053346240.jpg)
చందానగర్ పరువు హత్యను ఛేదించిన పోలీసులు
చందానగర్ పరువు హత్యను ఛేదించిన పోలీసులు
నిందితులు హేమంత్‌ను కారులో తీసుకెళ్లి.. ఒకచోట మద్యం సేవించిన నిందితులు.. తర్వాత తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. ఉరి బిగించి హత్య చేసినట్లు అంగీకరించారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరించారు.
ఇదీ చూడండి :ఎస్పీ బాలు మృతిపై సినీప్రముఖుల సంతాపం