ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్లపైనే వైకాపా నేతల వాహనాల పార్కింగ్​.. ట్రాఫిక్​ కష్టాలు - నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం

Heavy Traffic in YCP Plenary Area: గుంటూరులో జరుగుతున్న వైకాపా ప్లీనరీ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్​ సమస్యలు తప్పలేదు. ప్రత్యేకంగా పార్కింగ్​ సదుపాయం ఏర్పాటు చేసినప్పటికీ పలువురు వైకాపా నేతలు రోడ్లపైనే తమ వాహనాలను పార్కు చేసి వెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి ప్లీనరీకి వచ్చే సమయంలోనూ వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.

Plenary vehicles parking on the roads in guntur
Plenary vehicles parking on the roads in guntur

By

Published : Jul 8, 2022, 6:02 PM IST

Heavy Traffic in around Nagarjuna University: గుంటూరులో వైకాపా ప్లీనరీ సందర్భంగా నాగార్జున యూనివర్శిటీ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. లారీలు, భారీ వాహనాలను పోలీసులు ముందుగానే దారి మళ్లించినప్పటికీ.. ఇతర వాహనాలు ఎక్కువ సంఖ్యలో రాడంతో ఇబ్బందులు తప్పలేదు. ప్లీనరీకి విజయవాడ వైపు నుంచి వచ్చిన వాహనాలకు కాజ టోల్‌ ప్లాజా పక్కన ఉన్న రామకృష్ణ వెనుజియ, నాగార్జున యూనివర్శిటీలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఆ వాహనాల్లో వచ్చిన వారు అండర్ పాస్ నుంచి కాకుండా టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిని దాటి ప్లీనరీకి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో హైవేపై వచ్చే వాహనాలను ఆపి మరీ వైకాపా శ్రేణులను రోడ్డు దాటిస్తున్నారు పోలీసులు. ఇలా తరచుగా చేయడంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.

దానికి తోడు ప్లీనరీకి వచ్చిన కొందరు.. తమ వాహనాలను జాతీయ రహదారిపైనే పార్కింగ్ చేశారు. దాదాపు 20 చోట్ల పార్కింగ్​ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రధాన రహదారిపైనే వాహనాలు వదిలి వెళ్లారు. వేలాది మంది పోలీసులు ప్లీనరీ విధుల్లో ఉన్నా.. హైవేపై పార్కింగ్ వాహనాలను నిలువరించలేకపోయారు. మరికొందరు నాయకులు జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్డులోనూ వాహనాలను పార్కు చేశారు.

యూనివర్శిటీ నుంచి తాడేపల్లి వరకు నిలిపివేత: ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి ప్లీనరీకి వచ్చే సమయంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి తాడేపల్లి వరకు జాతీయ రహదారిపై మొత్తం వాహనాలను నిలిపివేశారు. ఆ సమయంలోనూ వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యమంత్రి హెలికాప్టర్​లో సభాస్థలికి వస్తారని ముందుగా ప్రకటించారు. అయితే వాతావరణం సరిగా లేని కారణంగా రోడ్డు మార్గంలోనే ప్లీనరీకి హాజరయ్యారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details