శ్రీశైలం జలాశయానికి భారీ వరద..విహంగ వీక్షణం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 10 గేట్లు ఎత్తి 4 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. కృష్ణానది ప్రవాహం, గేట్లు ద్వారా నీరు నాగార్జున సాగర్‌కు పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
పులిచింతలకు వరద..13 గేట్లు ఎత్తివేత
పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయం ఇన్‌ఫ్లో 4.10 లక్షల క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 3.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 44 టీఎంసీలు కాగా...పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఆనకట్ట 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.
ఇదీ చదవండి:ఉద్ధృతంగా కుందూ నది.. మునిగిన వంతెన