ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మిగులు జలాలపై అఖిలపక్ష కమిటీ వేయాలి' - guntur tdp

సీఎం జగన్ రాష్ట్రప్రజల భవిష్యత్తను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ వద్ద తాకట్టు పెట్టారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జీవీ ఆంజనేయులు

By

Published : Aug 2, 2019, 6:26 PM IST

గోదావరి మిగులు జలాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి... నదీజలాలు రక్షించాలని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రప్రజల భవిష్యత్తను తెలంగాణ సీఎం కేసీఆర్​ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. అన్నదాతలకు బాసటగా నిలిచే పోలవరం పనులను అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని త్వరితిగతిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీలో అవినీతి జరుగుతున్నా... అధికారులు చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

జీవీ ఆంజనేయులు

ABOUT THE AUTHOR

...view details