గుంటూరు జీజీహెచ్ వద్ద తెదేపా నేత జీవీ ఆంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు. జీజీహెచ్‌లో కరోనా రోగులను పరామర్శించేందుకు జీవీ, ఇతర నేతలతో కలిసి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అనుమతించలేదు. వారి తీరును నిరసిస్తూ తెదేపా నేతలు జీజీహెచ్ ఎదుట బైఠాయించారు. ఆంజనేయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
ఆంజనేయులును అడ్డుకున్న పోలీసులు.. జీజీహెచ్ ఎదుట బైఠాయింపు - ఈరోజు జీవీ ఆంజనేయులను అడ్డుకున్న పోలీసులు వార్తలు
తెదేపా ఇచ్చిన పిలుపు మేరకు కరోనా బాధితులకు భరోసా కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం.. పార్టీ సీనియర్ నాయకుడు జీవీ ఆంజనేయులు.. ఇతర నేతలతో కలిసి జీజీహెచకు బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. జీజీహెచ ఎదుట బైఠాయించి నేతలు నిరసన తెలిపారు.
జీవీ ఆంజనేయులను అడ్డుకున్న పోలీసులు