గోదావరి నదీజలాల ఒప్పందం విషయంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం... రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సాయం చేసినందుకు ప్రతిఫలంగా నదీ జలాలపై రాష్ట్ర హక్కులు దానం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి గుక్కెడు తాగు నీళ్లడిగితే కేసీఆర్ ఆనాడు అడ్డుపడ్డారని గుర్తు చేసిన ఆంజనేయులు...ఈ ప్రాజెక్టు కోసం 75 వేల కోట్లు పెట్టడం దండగన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయవచ్చని... మన నీళ్లు మనం వాడుకోవాలని సూచించారు. కేసీఆర్, జగన్ శాశ్వతం కాదని... ప్రజల ప్రయోజనం ముఖ్యమని ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.
'సొంత లాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టొద్దు' - gv. anjaneyulu
ఎన్నికల్లో కేసీఆర్ సాయం చేసినందుకు ప్రతిఫలంగా నదీ జలాలపై రాష్ట్ర హక్కులు దానం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.
జీవీ ఆంజనేయులు