ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజల సొమ్ము.. పక్క రాష్ట్రాలకు పంచిపెడుతున్నారు' - గురజాల మాల్యాద్రి

ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవాస్తవాలు చెబుతూ... ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా నేత గురజాల మాల్యాద్రి విమర్శించారు. ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాలకు పంచిపెడుతున్నారని ఆరోపించారు.

గురజాల మాల్యాద్రి

By

Published : Oct 12, 2019, 6:24 PM IST

గురజాల మాల్యాద్రి

ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని... ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి విమర్శించారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల్యాద్రి మాట్లాడారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవాస్తవాలు చెబుతూ... ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.4.84కు వచ్చే పవన విద్యుత్​ను కొనుగోలు చేయకుండా... రూ.11.68 వెచ్చించి పక్క రాష్ట్రాల నుంచి థర్మల్ విద్యుత్ ఎందుకు కొంటున్నారని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాలకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరును చూసి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details