ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుక్కను ఢీ కొట్టిన ద్విచక్రవాహవం.. యువకుడికి తీవ్ర గాయాలు - చిలకలూరి పేట

చిలకలూరిపేట పట్టణం నరసరావుపేట రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు.. కుక్కను ఢీ కొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనికి 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

Accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jul 15, 2021, 2:05 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో పట్టణ పరిధిలో గంగమ్మ గుడి వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడి కి తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీ ప్రాంతానికి చెందిన హేమంత్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో రోడ్డుపై కుక్క అడ్డం రావడంతో వాహనం అదుపు తప్పి కింద పడింది.

ఈ క్రమంలో రోడ్డుపై పడ్డ హేమంత్​కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స నిర్వహించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి:గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details