ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వేరే కేసు సమాచారం పొరబాటున అటాచ్ అయ్యింది' - గుంటూరు అర్బన్ ఎస్పీ తాజా న్యూస్

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి సంబంధించి టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తాడేపల్లి పోలీసులు పెట్టిన కేసుపై గుంటూరు అర్బన్ ఎస్పీ వివరణ ఇచ్చారు. రిమాండ్ రిపోర్ట్ టైప్ చేసే క్రమంలో.. వేరే కేసుకు సంబంధించిన సమాచారం పొరపాటున... ఈ కేసుకు అటాచ్ అయిందని చెప్పారు.

Guntur Urban SP's explanation on the case against TNSF leaders
టీఎన్ఎస్ఎఫ్ నేతలపై పెట్టిన కేసుపై గుంటూరు అర్బన్ ఎస్పీ వివరణ

By

Published : Jan 24, 2021, 11:37 AM IST

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి ఘటనలో టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తాడేపల్లి పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరణ ఇచ్చారు. ఈ కేసు ఎఫ్ఐఆర్​లో అత్యాచారయత్నం సంబంధిత సెక్షన్లు ఏమీ లేవని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

రిమాండ్ రిపోర్ట్ టైప్ చేసే క్రమంలో.. పొరబాటున వేరే కేసుకు సంబంధించిన సమాచారం ఈ కేసుకు అటాచ్ అయిందని వివరణ ఇచ్చారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన సెక్షన్ల కింద మాత్రమే విద్యార్థి నేతలపై కేసులు పెట్టామని ఎస్పీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details