ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్తవారు సంచరిస్తే సమాచారం ఇవ్వాలి: గుంటూరు అర్బన్ ఎస్పీ

గ్రామాల్లో ఎవరైనా కొత్తవారు సంచరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందిచాలని.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. పెదకాకాని మండలంలో బుధవారం అపహరణకు గురైన రెండేళ్ల బాలుడు జీవ తల్లిదండ్రులను కలసి ఆయన ధైర్యం చెప్పారు.

By

Published : Feb 25, 2021, 6:13 PM IST

Published : Feb 25, 2021, 6:13 PM IST

guntur urban sp ammireddy
గుంటూరు అర్బన్ ఎస్పీ

గ్రామాల్లో ఎవరైనా కొత్తవారు సంచరిస్తుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు రోడ్డులోని ఎస్.టీ కాలనీలో బుధవారం అపహరణకు గురైన రెండేళ్ల బాలుడు జీవ తల్లిదండ్రులను కలసి ఆయన ధైర్యం చెప్పారు. బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆయన వెంట మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ ఉన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో రెండేళ్ల బాలుడు అపహరణ.. రంగంలోకి పోలీసులు!

ABOUT THE AUTHOR

...view details