కరుడు గట్టిన ఓ అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. అతనివద్ద నుంచి భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి శనివారం మీడియాకు వివరించారు.
కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు - chain snatcher arrested in guntur news
బైక్లు, మహిళల మెడలోని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 10 లక్షల రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరుకు చెందిన బండి శివకుమార్ బైక్లు, మహిళల మెడలోని బంగారు గొలుసులను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 96 కేసులున్నాయి. ఒంగోలు, విజయవాడ,గుంటూరు ప్రాంతాల్లో జరిగిన 11 చైన్ స్నాచింగ్ కేసుల్లో శివను నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
నిందితుడి నుంచి 10.80 లక్షల రూపాయల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. ఇలాంటి దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగారు ఆభరణాలు ధరించే మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.