గుంటూరులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని కోరుతూ.. తెదేపా నేతలు(tdp leaders) గుంటూరు అర్బన్ ఎస్పీ(guntur urban sp)కి వినతి పత్రం అందజేశారు. గత కొంతకాలంగా ఓ ముఠా.. "బోడాలాండ్ లాటరీ" పేరుతో లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
TDP leaders : "బోడాలాండ్ లాటరీ"పై.. పోలీసులకు ఫిర్యాదు
గుంటూరు(Guntur) నగరంలో అమాయక యువతను ఏమారుస్తూ.. ఓ ముఠా "బోడాలాండ్ లాటరీ" పేరుతో లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతోందని తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు తెదేపా నేతలు
ఈ "బోడాలాండ్ లాటరీ"కి బానిసలుగా మారిన యువకులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని చెప్పారు. అదేవిధంగా.. గుట్కా(gutka) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే వీటిపై దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో.. తెదేపా గుంటూరు తూర్పు సమన్వయకర్త నసీర్ అహమ్మద్, తదితరులు ఉన్నారు.
ఇదీచదవండి.