కొవిడ్ కారణంగా మరణించిన వారి మృతదేహాలకు.. అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు. జిల్లాలో కరోనా బాధితులకు.. వివిధ రకాలుగా సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని ఎస్పీ సన్మానించారు. వారి సేవల్ని మరింతగా విస్తరించాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకున్నారని అభినందించారు. సేవా సంస్థలు నేటితరానికి ఆదర్శమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.
కరోనా వేళ సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సన్మానం - గుంటూరులో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సన్మానించిన ఎస్పీ
కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలకు.. అంత్యక్రియలు చేపడుతున్న స్వచ్ఛంద సంస్థల సేవలు వెలకట్టలేనివని.. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని ఆయన సన్మానించారు.

కరోనా వేళ సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సన్మానం