ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పొందుగల చెక్​పోస్ట్​ను తనిఖీ చేసిన రూరల్​ ఎస్పీ - guntur rural sp latest news

పొందుగల చెక్​పోస్ట్​ను గుంటూరు రూరల్​ ఎస్పీ విజయారావు తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. లాక్​డౌన్​ ముగిసే వరకు ప్రజలు సహకరించాలని కోరారు.

guntur rural sp visits pondugula check post
పొందుగల చెక్​పోస్ట్​ను పరిశీలిస్తున్న గుంటూరు రూరల్​ ఎస్పీ

By

Published : May 5, 2020, 6:38 PM IST

గుంటూరు జిల్లా పొందుగల చెక్​పోస్టును రూరల్​ ఎస్పీ విజయారావు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్​డౌన్​ కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి నాగార్జున సాగర్​ కుడి కాలువ ద్వారా కొందరు దొంగచాటుగా రాకపోకలు సాగిస్తున్నారని... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కూలీల విషయంపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపడతామన్నారు.

పొందుగల చెక్​పోస్ట్​ను పరిశీలిస్తున్న గుంటూరు రూరల్​ ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details