ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధించినట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరసరావుపేట, గణపవరం లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన ఆయన... కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని అధికారులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా ఆయా గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి సారించినట్లు ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు.
VISHAL GUNNY : 'విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు' - guntur district latest news
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధించినట్లు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఎస్పీ విశాల్ గున్నీ