పోలీస్ శాఖ తరఫున రాత్రి గస్తీ విధానంలో మార్పులు చేసి దేవాలయాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఆలయాల సంరక్షణకు తీసుకుంటున్న భద్రత చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా పిడుగురాళ్లలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయాల సంరక్షణకు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రామ రక్షక బృందాల సభ్యులతో మాట్లాడారు. వాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100, వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 8866268899కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా యువత తమ పరిసర ప్రాంతాల్లో ఆలయాల పరిరక్షణకు ముందుకొచ్చి అసాంఘిక శక్తుల ఆటలు కట్టించాలన్నారు.
'ఆలయాల సంరక్షణకు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై రూరల్ ఎస్పీ దిశానిర్దేశం' - sp direction on security measures at temples
గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో ఆలయాల సంరక్షణకు తీసుకుంటున్న భద్రత చర్యలను రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. ఆలయాల సంరక్షణకు గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రామ రక్షక బృందాల సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

ఆలయాల సంరక్షణకు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై రూరల్ ఎస్పీ దిశానిర్దేశం
వివిధ మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాల్లో ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగముగా స్థానిక రెవెన్యూ, దేవాదాయ శాఖ, ఆయా ఆలయ ధర్మకర్తల సహకారంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి:అధికారులంతా ఎస్‌ఈసీ ఆదేశాలు పాటించాలి: నిమ్మగడ్డ