ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎదుటి వారికి కరోనా ఉందనే భావనతో అప్రమత్తంగా ఉండాలి' - corona updates at corona

లాక్ డౌన్ కాలంలో నియంత్రణంలో ఉన్న కరోనా కేసులు అన్​లాక్ మొదలయ్యాక నాలుగు రెట్లు పెరిగాయని గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తెలిపారు. బయటకు వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నవారికి కరోనా ఉందనే అభిప్రాయంతోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. విధుల్లో ఉన్న పోలీసులకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో దశసూత్రాల పేరిట వారికి రక్షణ చర్యలు సూచించామన్నారు. పోలీసులకు సహకరించటంతో పాటు... కరోనాకు సంబంధించి ఎలాంటి అనుమానమున్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలంటున్న ప్రభాకరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

guntur range ig on corona precautions
గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు

By

Published : Jul 7, 2020, 1:04 PM IST

ఈటీవీ భారత్: అన్​లాక్ మొదలైన తర్వాత కరోనా కేసుల సంఖ్య ఎలా పెరుగుతున్నాయి. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు ఏం సూచిస్తారు? ప్రభాకరరావు: మన రేంజ్ పరిధిలో నాలుగు రెట్లు కేసులు పెరిగాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 4వేల కేసులు దాటిపోయాం. ప్రజలు స్వేచ్ఛగా బయటకు రావటమే దీనికి గల ప్రధాన కారణం. 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తుండటం గమనించాలి. అందుకే మన ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరినీ కరోనా పాజిటివ్ అనుకుని అప్రమత్తంగా ఉండాలి. మాస్క్ ధరించటం, చేతులు శానిటైజ్ చేసుకోవటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి

ఈటీవీ భారత్: పోలీస్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎలా ఉండబోతుంది?
ప్రభాకరరావు: బయటకు వచ్చేవారు కచ్చితంగా మాస్క్ ధరించాలి. లేకపోతే పట్టణ ప్రాంతాల్లో రూ.100, గ్రామీణ ప్రాంతాల్లో రూ.50 జరిమానా విధిస్తున్నాము. ఇప్పటి వరకూ గుంటూరు రేంజ్ పరిధిలో 60లక్షల రూపాయల మేర జరిమానాలు వసూలు చేసి ప్రభుత్వానికి డిపాజిట్ చేశాం. అందుకే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నాం.

ఈటీవీ భారత్: పోలీసులు కూడా కరోనా భారిన పడుతున్నారు. వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రభాకరరావు: పోలీసులు ప్రజలతో కలిసేది ఎక్కువ కాబట్టి వారు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారికి వైరస్ సోకింది. మూడు జిల్లాల పరిధిలో 73మందికి పాజిటివ్ వచ్చింది. వారిని, వారి కుటుంబాలను జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. పోలీస్ శాఖ తరఫున దశసూత్రాలు రూపొందించి వాటిని అమలు చేయమన్నాం. పోలీస్ స్టేషన్ కు అవసరాన్ని బట్టే ప్రజల్ని రానివ్వాలి. సురక్షిత ప్రదేశంలోనే వారితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలి. స్టేషన్ ప్రాంగణాన్ని క్రిమి సంహారకంతో శుద్ధి చేయించాలి. స్టేషన్​కు వచ్చేవారంతా భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించేలా చూడాలి. జిల్లా వదిలి వెళ్లే సమయంలో ఎస్పీ అనుమతి తప్పనిసరి చేశాం. అరెస్టు సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిందితుల ద్వారా పోలీసులకు పాజిటివ్ వస్తున్నట్లు తేలింది. అందుకే అరెస్టులు, విచారణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాం.

ఈటీవీ భారత్: పోలీసుల మనో స్థైర్యం నింపేందుకు శాఖాపరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు?
ప్రభాకరరావు: ఈ వ్యవహారాన్ని నేరుగా డీజీపీ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ప్రత్యేకంగా ఓఎస్డీని నియమించారు. పోలీసుల క్షేమం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను ఏర్పాటు చేశారు. ఎవరైతే కరోనా భారిన పడ్డారో వారిని అసుపత్రిలో చేర్పించటం, చికిత్స చేయించటం బయటకు వచ్చే వరకూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. పోలీసు కుటుంబాలతోనూ మాట్లాడుతున్నాం. వాళ్లలో మనోధైర్యం నింపడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం.

ఈటీవీ భారత్: కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధి తగ్గించారు. అయినా కొన్నిచోట్ల ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి ప్రజలకు ఏం చెబుతారు? ప్రభాకరరావు: భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం 28 రోజుల వరకూ కేసు రాకపోతేనే కంటైన్మెంట్ క్లస్టర్ ఎత్తివేయటం జరుగుతుంది. అలా జరగటం స్థానిక ప్రజల చేతిలోనే ఉంటుంది. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే వారు బయటకు రాకూడదు. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్రభుత్వ యంత్రాంగం సమకూరుస్తుంది. ఏమైనా సమస్యలుంటే వాటిని తెలుసుకుని పరిష్కరిస్తాం.

ఈటీవీ భారత్: కేసులు పెరుగుతున్న తరుణంలో పాజిటివ్​కు సంబంధించిన కాంటాక్ట్స్ సేకరించటం ఎలా వేగవంతం చేశారు. ఈ విషయంలో ప్రజల నుంచి ఎలాంటి సహకారం కోరుతున్నారు?
ప్రభాకరరావు: మొదటి నుంచి కాంటాక్ట్స్ సేకరణ కార్యక్రమం సజావుగా జరుగుతోంది. అందులో ఎలాంటి సమస్య లేదు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీల విషయంలో సమస్య ఎదురవుతోంది. కొందరు కరోనా లక్షణాలు కనిపించినా బయటకు చెప్పటం లేదు. అలా కొందరు వ్యాధి ముదిరి మరణించారు. కరోనా వచ్చినందుకు భయపడాల్సిన పనిలేదు. అధికారులకు సమాచారం ఇస్తే వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తారు. ఈ విషయంలో ప్రజల సహకారం కోరుతున్నాం.

ఈటీవీ భారత్: వాణిజ్య సంస్థలు, దుకాణాల వద్ద నిర్వాహకులు, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రభాకరరావు: ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా వ్యాపారులు చర్యలు తీసుకోవాలి. అలాగే మాస్కు తప్పనిసరి. నిర్దేశిత సమయాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. శానిటైజ్ చేసుకోవటం తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణం మూసివేస్తామని హెచ్ఛరిస్తున్నాం. ప్రస్తుతం లాక్​డౌన్ చేసే పరిస్థితి లేకపోయినా... దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కరోనా టెస్ట్ చేయకుండానే.. పాజిటివ్, నెగిటివ్ మెసేజ్​లు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details