గుంటూరు నగరంలోని అడవి తక్కెళ్లపాడులో 12 సంవత్సరాల క్రితం రాజీవ్ గృహకల్ప పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. మొత్తం 35 బ్లాకులను నిర్మించగా... ఒక్కో బ్లాక్‌ల్లో 32 చొప్పున.. దాదాపు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే నివాస సముదాయాలు నిర్మించిన ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణను మాత్రం విస్మరించింది. ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ డ్రైనేజిలు పొంగి పొర్లుతున్నాయి.
ఇటీవల వర్షాల కారణంగా డ్రైనేజిలలో పూడిక పేరుకుపోయింది. దీంతో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ పొంగి బయటకు ప్రవహిస్తోంది. నివాస సముదాయాలను మురుగు చుట్టుముట్టింది. విపరీతమైన దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బ్లాకుల వద్ద ఇళ్లలోని వారు బయటకు వచ్చేందుకు కూడా వీల్లేదు. ఒకవేళ రావాలంటే మురుగులో నడుస్తూ రావాలి. దోమలు, విషపురుగులు చేరి ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలు జ్వరం బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులకు సమస్య విన్నవించినా పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు.
పట్టని పాట్లు