గుంటూరు జిల్లా ఆంధ్రా - తెలంగాణ సరిహద్దులో గల పొందుగల చెక్పోస్ట్ వద్ద నాలుగు నెలల క్రితం కొవిడ్-19 స్టేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 7 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రం మీదుగా 1.12 లక్షల మంది ఏపీకి వచ్చారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ కేంద్రంలోకి వెళ్లి థర్మల్ స్క్రీనింగ్ చేయించుకొని ఆధార్ కార్డు ఆధారంగా పేర్లు నమోదు చేయించుకోవాలి. అనుమానం వచ్చిన వారికి స్వాబ్ పరీక్షలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆయూష్ వైద్యుడు శ్రీనివాస్ నేతృత్వంలో వైద్యులు సరళాకుమారి, స్వర్ణలత, 20 మంది పారా మెడికల్ సిబ్బంది నిత్యం పని చేస్తున్నారు.
ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి 421, రాజస్థాన్ 279, మధ్యప్రదేశ్ 53, గుజరాత్ 34, దిల్లీ 14 మంది రాగా... ఇతర దేశస్థులు 48 మంది వచ్చారు. మిగతా వారంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వీరిలో అనుమానం వచ్చిన 4813 మందికి స్వాబ్ పరీక్షల ద్వారా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 21 మందికి పాజిటివ్ ఉన్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.