గుంటూరులో చికెన్ దుకాణాల వద్ద మాంసం ప్రియులు క్యూ కట్టారు. ఇన్నాళ్లూ నగరంలోని చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న కారణంగా.. మాంసాహార దుకాణాలు తెరిచేందుకు జిల్లా అధికారులు అనుమతి ఇవ్వలేదు.
కొద్ది రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల అధికారులు కొంత సడలింపు ఇచ్చారు. రోజూ కాయగూరలు, పప్పుతో సరిపెట్టుకున్న ప్రజలు చికెన్ కోసం ఎన్నడూ లేని విధంగా గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుని కొనుగోలు చేశారు. కిలోమీటర్ వరకు క్యూ లైన్లు పెట్టారు. చికెన్ ధరలు పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జోరుగా జరిగాయి.