ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రెడ్​జోన్​లోని ఇళ్ల వద్దకే నిత్యావసరాలు' - గుంటూరులో రెడ్​జోన్​ వార్తలు

గుంటూరులోని రెడ్​జోన్ ప్రాంతాల ప్రజలకు మరింత చేరువలో నిత్యావసర సరకులు అందేలా నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంది. ఇళ్ల వద్దకే నిత్యావసరాలు విక్రయించే వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు.

guntur municipal commissioner visited redzone areas
రెడ్​జోన్ ప్రాంతాల్లో పర్యటించిన గుంటూరు నగర పాలక కమిషనర్

By

Published : Apr 25, 2020, 2:08 AM IST

గుంటూరులోని రెడ్​జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరకులు, కూరగాయలు ఇళ్ల వద్దకే అందిస్తున్నామని... నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ వివరించారు. ఈ ప్రాంతం నుంచి రాకపోకలు జరపకూడదని ప్రజలకు సూచించారు. మర్చంట్స్ అసోసియేషన్, రిలయన్స్, అమరావతి మార్ట్, స్వయం సహాయక సంఘాలు, యస్.జి.ఓ.ల సహకారంతో... 15 రకాల సరకులు, 15 రకాల కూరగాయలు, పాల విక్రయ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. అమ్మకందార్లు కూడా సరకులు, ఇతర వస్తువులు నాణ్యత లోపం లేకుండా... ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details