కరోనా నియంత్రణకు ప్రజల సహకారం అవసరమని.... నగరంలో కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ నోడల్ అధికారులకు సూచించారు. సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బారీకేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ.... ప్రజల రాకపోకలు చేస్తున్నారని, కొందరు కరోనా పరీక్ష చేయించుకుని ఫలితం వచ్చేవరకు ఇంట్లో ఉండకుండా యథావిధిగా తిరుగుతున్నారని ఆమె అన్నారు. దీనివల్ల కేసులు పెరుగుతున్నాయన్నారు.
'కరోనా కట్టడికి అవగాహన కార్యక్రమాలు చేపట్టండి' - గుంటూరు కొవిడ్ వార్తలు
నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో...ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ అధికారులకు సూచించారు.
నోడల్ అధికారులు స్థానికంగా ఉన్న వారి సహకారంతో కరోనా ప్రమాదం, ప్రజలు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించాలన్నారు. పాజిటివ్ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు 24 గంటల్లో పరీక్షలు చేయాలన్నారు. సర్వేలెన్స్, ఆక్సిమీటర్, ధర్మల్ మీటర్ ద్వారా జరిగే సర్వేలో నోడల్ అధికారులు పాల్గొని వేగంతం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం పరిధిలో మాస్క్ లేకుండా తిరిగే వారికి మహిళా పోలీసులు జరిమానా విధించాలన్నారు.
ఇవీ చదవండి:అనధికారికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు.. ప్రైవేట్ ల్యాబ్‌లలో భారీ వసూళ్లు