ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గౌరవ అధ్యక్షుడిగా తెదేపా ఎమ్మెల్యే..ఛైర్మన్​గా వైకాపా నేత

గుంటూరు మిర్చి యార్డు నూతన పాలకమండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గౌరవ అధ్యక్షుడిగా తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ను, చైర్మన్​గా గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఏసురత్నంకు అవకాశమిచ్చారు.

By

Published : Jan 24, 2020, 5:41 PM IST

guntur-mirchi-yard-is-the-new-governing-body
guntur-mirchi-yard-is-the-new-governing-body

గుంటూరు మిర్చి యార్డుకు గౌరవ అధ్యక్షుడిగా తెదేపా ఎమ్మెల్యే..ఛైర్మన్​గా వైకాపా నేత
గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ (తెదేపా)ను గౌరవ అధ్యక్షుడిగా నియమించింది. ఉపాధ్యక్షుడిగా శృంగవరపు శ్రీనివాస్ నియమితులయ్యారు. అలాగే మరో 17 మందిని సభ్యులను నియమించారు. ఈ పాలక మండలి ఏడాది పాటు కొనసాగనుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఏసురత్నంకు ప్రభుత్వం మిర్చి యార్డు ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details