ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GUNTUR MAYOR : 'రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి జిన్నా టవర్ అంశం' - Jinna Tower

గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ చేపట్టిన కంచె నిర్మాణ పనులను మేయర్ కావటి మనోహర్ సందర్శించారు. రాజకీయ లబ్ధి కోసం జిన్నా టవర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదని వెల్లడించారు.

గుంటూరు మేయర్ కావటి మనోహర్​ నాయుడు
గుంటూరు మేయర్ కావటి మనోహర్​ నాయుడు

By

Published : Jan 24, 2022, 9:57 AM IST

రాజకీయ లబ్ధి కోసం గుంటూరు జిన్నా టవర్ అంశాన్ని భాజపా నేతలు తెరపైకి తీసుకొచ్చారని గుంటూరు మేయర్ కావటి మనోహర్​ నాయుడు అన్నారు. జిన్నా టవర్ ఒక చారిత్రక చిహ్నమని తెలిపారు. కులమతాల మధ్య సహృద్భావాన్ని పెంచే ఇలాంటి కట్టడాలను పరిరక్షించడం నగరపాలక సంస్థ బాధ్యత అని వివరించారు. జిన్నా టవర్ చుట్టూ చేపట్టిన కంచె నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జిన్నా టవర్ పేరు మార్చాలని భాజపా నేతలు చేస్తున్న డిమాండ్​లో అర్ధం లేదని మనోహర్ నాయుడు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details