ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ మంత్రి కన్నాపై గుంటూరు మేయర్ విమర్శలు - మాజీ మంత్రి కన్నాపై విమర్శలు

కేంద్ర మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

guntur mayor manohar naidu
గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు

By

Published : May 18, 2021, 10:47 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో మత రాజకీయాలు మానుకోవాలని.. గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సూచించారు. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు కష్టపడుతుంటే.. దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'ఆర్మీ' పేపర్​ లీక్​: సికింద్రాబాద్ కల్నలే సూత్రధారి!

ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వానికి సహకరించకపోగా.. విమర్శలు చేయడం తగదని మనోహర్ నాయుడు హితవు పలికారు. విజయవాడలో 40 ఆలయాల్ని కూల్చివేసినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కొవిడ్ విస్తృత వ్యాప్తివేళ.. దేవాలయాల ఫంక్షన్ హాల్స్​లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:కపిల జాతి ఆవుకు పుంగనూరు దూడ జననం

ABOUT THE AUTHOR

...view details