ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి' - guntur jc review meeting with ggh staff on covid patient treatment news

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా జాయింట్​ కలెక్టర్​ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలని సూచించారు.

'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'
'కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'

By

Published : Jul 25, 2020, 9:03 PM IST

కరోనా నుంచి బాధితులు త్వరగా కోలుకునేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా జాయింట్​ కలెక్టర్​ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాజువాల్టి, కరోనా ఓపీ వార్డులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతోన్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యుడు కె.సుధాకర్​తో కలిసి కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనుమానిత లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు చేసి.. త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details