కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు ఐడి ఆసుపత్రి ఆర్.ఎం.వో డాక్టర్ సునంద తెలిపారు. అనుమానితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు ప్రత్యేక వైద్య బృందాలను ఉంచామని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో వెంటిలేటర్లు, మొబైల్ ఎక్స్ రే యూనిట్, సరిపడా మందులు, సిబ్బందిని కరోనా చికిత్స కోసం సిద్ధంగా ఉంచామని వివరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు తెలిపారు. అతని నమూనాలు సేకరించి తిరుపతికి పంపామన్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు వెల్లడించారు.
కరోనా వైద్యానికి గుంటూరు ఆసుపత్రి సిద్ధం - guntur hospital latest updates
కరోనా అనుమానితులను, వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించేందుకు గుంటూరు ఆసుపత్రి సిద్ధంగా ఉందని ఆర్.ఎం.వో డాక్టర్ సునంద తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వృద్ధుడి ఆసుపత్రిలో చేర్చుకున్నామన్నారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, నమూనాలు సేకరించి తిరుపతికి పంపామన్నారు.
కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించేందుకు సిద్ధమన్ను గుంటూరు ఆసుపత్రి ఆర్.ఎం.వో