ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మృతదేహాలతో నిండిపోయిన గుంటూరు జీజీహెచ్​ మార్చురీ - గుంటూరు జీజీహెచ్​లో కరోనా పరీక్షలు ఆలస్యం

అయిన వాళ్లకు ఏమైన అయ్యిందంటే ప్రాణం విలవిల్లాడిపోతుంది. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి బాగు చేయించే వరకూ మనసు ఊరుకోదు. అలాంటిది కుటుంబ సభ్యులే పోయినా పట్టించుకోవడం లేదు. అంతిమ సంస్కారాలు చేయాల్సి ఉన్నా బాధ్యతను విస్మరించారు. కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం....బంధాలను, అనుబంధాలను మసకబార్చుతోంది. గుంటూరు జీజీహెచ్‌ శవాగారంలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం

guntur ggh mortuary is filled with dead bodies due to delay of swab test
స్వాబ్​ పరీక్షల ఫలితాలు ఆలస్యం

By

Published : Jul 27, 2020, 1:53 AM IST

Updated : Jul 27, 2020, 11:31 AM IST

గుంటూరు జీజీహెచ్‌ .....ఎంతోమందికి తిరిగి ప్రాణం పోసిన ఆసుపత్రి ఇది. ఇంత పెద్ద ఆసుపత్రిలో ప్రస్తుతం మార్చురీ విభాగం వద్ద దయనీయ పరిస్థితి ఉంది. శవాగారం మొత్తం మృతదేహాలతో నిండిపోయింది. సాధారణ రోజుల్లో 10, 15 మృతదేహాలు ఇక్కడ ఉంటాయి. బంధువులు రాక ఆలస్యం, మృతదేహాల గుర్తింపులో ఇబ్బంది వంటి కారణాల కారణంగా కొన్ని రోజుల పాటు మార్చురీలోనే వీటిని ఉంచేస్తారు. ఏ రోజుకు ఆరోజు మృతదేహాల తరలింపుతో మార్చురీలో ఉండే వాటి సంఖ్య 15 మించదు. కానీ ప్రస్తుతం 40కి పైగా మృతదేహాలు శవాగారంలో ఉన్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కుటుంబీకులు, బంధువులు …...తమ వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తమ ఇంటికి తీసుకెళ్లలేమంటూ వదలి పెట్టేస్తున్నారు.

మృతదేహాలతో నిండిపోయిన గుంటూరు జీజీహెచ్​ మార్చురీ

కరోనా సోకిన వారి మృతదేహాలను అయినవాళ్లు ఇంటికీ తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. సాధారణ మరణాలైనా ఇరుగుపొరుగు వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చెయ్యాలంటే జనం వెనకాడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు కారణంగా అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ...దహన సంస్కారాలు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి కారణాలతోనే గుంటూరు జీజీహెచ్‌లో మార్చురీ మొత్తం శవాలతో నిండిపోయింది. కొత్తగా వచ్చే శవాలను మార్చురీలో పెట్టలేని పరిస్థితి. ఏం చెయ్యాలో అర్థకావడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు తమ వారి మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించిన పరిస్థితుల్లో కనీసం మున్సిపల్‌ శాఖ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. మృతదేహాల బాధ్యతను తీసుకోవాలి. ఆయా శాఖల మధ్య సమన్వయం లోపంతో ఆసుపత్రి మార్చురీలో శవాలు పేరుకుపోతున్నాయి


బంధువులు తీసుకెళ్లడం లేదు..

సుపత్రిలోని మార్చురీ ఇప్పటికే శవాలతో నిండిపోయింది. అక్కడ 30 మృతదేహాలు ఉన్నాయి. రోగుల సహాయకులకు ఫోన్లు చేసి చెబుతున్నా మృతదేహాలను తీసుకెళ్లటం లేదు. ఎక్కడ భద్రపరచాలో తెలియటం లే దు. ఆసుపత్రిలో పరిస్థితిని జిల్లా కలెక్టర్‌, జేసీ దృష్టికి తీసుకెళ్లాం. కొందరు వైద్యం చేయించుకోవడానికి వచ్చి చనిపోగానే వారి బంధువులు కరోనా ఉందేమోనన్న భయంతో మృతదేహాలను వదిలేసి వెళుతున్నారు. గుంటూరు నగరంలోని శ్మశానవాటికలో రోజుకు నాలుగు మృతదేహాలను మాత్రమే దహనం చేయగలిగే సౌకర్యం ఉంది. దీని సామర్థ్యం పెంచాలని ఇప్పటికే ఉన్నతాధికారులు నగర కమిషనర్‌కు సూచించారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది- - ఆచార్య కె.సుధాకర్‌, ఆస్పత్రి పర్యవేక్షకులు

ఇదీ చదవండి :

గుంటూరు సర్వజనాస్పత్రిలో సత్వర స్పందన కరవు..!

Last Updated : Jul 27, 2020, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details