గుంటూరు సర్వజనాస్పత్రిలో కొవిడ్ చికిత్సలు, నాన్ కొవిడ్ చికిత్సలకు వేర్వేరుగా బ్లాకులు ఏర్పాటు చేశారు. కానీ కరోనా దెబ్బకు అత్యవసర, సాధారణ వైద్యసేవలు నామమాత్రంగా మిగిలాయి. రోడ్డు ప్రమదాల్లో గాయపడినవారు, గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడేవారికి అత్యవసర వైద్యం కీలకం. గుంటూరు సర్వజనాస్పత్రిలో ఈ సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా విన్పిస్తున్నాయి.
తాజాగా సునీమా అనే 12ఏళ్ల బాలిక మృతి వివాదాస్పదమైంది. న్యుమోనియోతో బాధపడుతున్న సునీమాను ఉదయం 11 గంటలకు ఆస్పత్రికి తీసుకొస్తే... సాయంత్రం 5 గంటలకు చనిపోయింది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ ఆస్పత్రి ఆవరణలో బాలిక తల్లి రోధించడం అందరినీ కంటతడిపెట్టించింది.