ఆన్ లైన్ రుణ యాప్లతో ప్రజలు మోసపోతున్న నేపథ్యంలో వారికి అవగాహన కల్పించేలా గుంటూరు అర్బన్ పరిధిలో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. నగరంపాలెంలోని రుషి వ్యాలీ అపార్టుమెంటులో కంట్రోల్ రూమ్ పోలీసులు.. సదస్సు నిర్వహించారు. యాప్ల వలలో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రయాణాల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం ఆవశ్యకతను పోలీసులు వివరించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు.
'ఆన్ లైన్ రుణ యాప్లతో అప్రమత్తం తప్పనిసరి' - గుంటూరు జిల్లా పోలీసుల అవగాహన సదస్సులు
ఆన్ లైన్ రుణ యాప్లతో మోసపోతున్న ప్రజలకు గుంటూరు జిల్లా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రయాణాల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం ఆవశ్యకతను తెలియజేశారు.
గుంటూరు జిల్లా పోలీసుల అవగాహన సదస్సు