గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 29 వేల 984కి చేరుకుంది. ఇవాళ కొత్తగా 7మరణాలు సంభవించాయి. దీంతో కరోనా మరణాల సంఖ్య 313కు చేరుకుంది. కరోనా మరణాల్లో గుంటూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో 20 వేల 265 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గుంటూరు జిల్లాలో కొత్తగా 555 కరోనా కేసులు - ఏపీ కరోనా కేసులు అప్ డేట్స్
గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 555 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,984కు చేరింది. కరోనాతో ఇవాళ 7గురు మరణించారు. మరణాల సంఖ్యలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది.
జిల్లాలో కొత్తగా 555 కరోనా కేసులు
ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా నరసరావుపేటలో 141, గుంటూరు నగరంలో 95 ఉన్నాయి. తెనాలిలో 70, బాపట్ల 35, పొన్నూరు 22, మాచర్ల 21, మంగళగిరి 19, కర్లపాలెం 15, చేబ్రోలు 12, తాడేపల్లిలో 11 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 114 కేసులు వచ్చాయని బులిటెన్ విడుదల చేశారు.
ఇదీ చదవండి :అల్పపీడన ప్రభావం.. గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన