గుంటూరు నగరానికి చెందిన సురేశ్‌బాబు, లక్ష్మి దంపతులు గో సేవలో తరిస్తున్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న సురేశ్ బాబు... పుంగనూరు జాతి ఆవును కొనుగోలు చేశారు. వారు నివసించే అంతస్థులోనే దానికి సపర్యలు చేస్తున్నారు. గౌరిగా నామకరణం చేసి పూజలు చేస్తున్నారు. గౌరి వచ్చాక సమయమే తెలియడంలేదని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గౌరికి ఆహారంగా... పచ్చగడ్డి, ఉలవలు, బిస్కెట్లు, చపాతీలు పెడుతున్నామని సురేశ్‌బాబు, లక్ష్మి దంపతులు చెబుతున్నారు.
మూడంతస్తుల మేడలో మూడు అడుగుల ఆవు! - Guntur couple
కాంక్రీట్ జంగల్ వంటి గుంటూరు నగరంలో... ఓ మూడంతస్థుల భవనం. ఆ భవనంలోని పై అంతస్థులోకి వెళ్లగానే... గజ్జెల చప్పుడుతో గౌరి స్వాగతం పలుకుతుంది. ఒడిలో తలపెట్టి అప్యాయత కనబరుస్తుంది. నోటికి ఏదైనా అందిస్తే ఆరగిస్తుంది. ఇంతకీ గౌరీ ఎవరనేగా మీ సందేహం... ఇది చూడండి... ఎవరో తెలుస్తుంది.
గజ్జెల చప్పుడుతో గౌరి స్వాగతం
Last Updated : Sep 28, 2019, 9:40 AM IST