కంటైన్మెంట్ ప్రాంతాలలో మెడికల్ అధికారులు నిర్వహిస్తున్న సర్వే పనులు వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు. ఆనందపేట, చాకలికుంట ప్రాంతాల్లో పర్యటించి మెడికల్ అధికారులు నిర్వహిస్తున్న సర్వే పనులను, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్వేలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రజల నుంచి అన్ని వివరాలు సేకరించాలన్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే అధికారులకు తెలియచేసి.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
కంటైన్మెంట్ ప్రాంతాలను పరిశీలించిన నగర పాలక సంస్థ కమిషనర్ - guntur commissioner visit containment areas news
గుంటూరు కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సర్వే పనులను నగర పాలక సంస్థ కమిషనర్ అనురాధ పరిశీలించారు. డోర్ టు డోర్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
guntur commissioner